తన ఎక్స్ ప్రెషన్స్ తో రాత్రికి రాత్రే సెలబ్రటీ అయిపోయింది. కోట్లాదిమంది నెటిజన్ల హృదయాలను దోచుకుంది. ఆమే కేరళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్. అయితే ప్రియ నటించిన ‘ఒరు అదార్ లవ్’ మళయాళ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. 'ఒరు అదార్ లవ్' దర్శకుడు... ఉమర్ లూలూకు హైదరాబాద్ సౌత్ జోన్ పోలీసుల నోటీసులు జారీ చేశారు. ఆ సినిమాలోని ‘మాణిక్య మలరాయ పూవీ’ పాటలోని లిరిక్స్.. ముస్లింల మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నాయని ఇటీవల ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుపై విచారణలో భాగంగా ఒరు అదాదర్ లవ్ మూవీ దర్శకుడు ఉమర్ లులూకి నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని పోలీసులు కోరారు.
కాగా, ఆ పాట లిరిక్స్ పై ముస్లింలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తమ మనోభావాలను కించపరిచే విధంగా ఉన్న ఆ పాటను నిషేధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.