తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు సర్కార్ మరో శుభవార్త వినిపించింది. రాష్ట్రంలో 10 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఖాళీగా ఉన్న ఈ పోస్టులను టీఎస్ పీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరో పది రోజుల్లో ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం టీఎస్పీఎస్సీని ఆదేశించింది.