మెడిసిన్,బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకోసం నిర్వహించిన ఎంసెట్ -3 పరీక్ష ఫలితాలు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానున్నాయి. సెప్టెంబర్ 11న ఎంసెట్ -3 నిర్వహించారు. ప్రశ్నాపత్రంలో 5 నుంచి 7 ప్రశ్నలకు అదనపు మార్కులు కలపాలని నిర్వాహకులు నిర్ణయించారు. కొన్ని ప్రశ్నల్లో తప్పులు దొర్లాయని విద్యార్థుల తల్లిదండ్రులు, లెక్చరర్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వీటిని మళ్లీ లోతుగా అధ్యయనం చేసి మార్కులు కలపాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ పరీక్షకు 56,153 మంది విద్యార్థులకు గానూ 37,199 మంది హాజరయ్యారు. ఫలితాలు www.tseamcet.in వెబ్సైట్లో చూడొచ్చు.