జమ్మూకాశ్మీర్ లోని ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. బందిపోరా జిల్లా మోహల్లా హాజన్ ప్రాంతంలో భద్రతాబలగాలు - ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకుంది. ఈ ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. కాల్పులు ఇంకా కొనసాగుతుండటంతో భారీగా భద్రతాబలగాలు ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు యత్నిస్తున్నాయి.