హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీపై అభిమానంతో ఇరాన్‌కు చెందిన సహర్ తబర్ అనే 19 ఏళ్ల యువతి కొన్ని నెలలుగా 50 శస్త్రచికిత్సలు చేయించుకుంది. జోలీలాగే కనిపించాలని, 40 కిలోలకు మించి బరువు పెరగకుండా ఉండటానికి కఠినమైన ఆహార నియమాలు పాటించింది. శస్త్రచికిత్సకు ముందు, ప్రస్తుతం ఎలా తయారయ్యానో చూడండి అంటూ ‘ఇన్ స్టాగ్రామ్’లో ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు సంచలనం సృష్టిస్తున్నాయి. కొందరైతే, చనిపోయాక మంత్రగత్తె బతికించిన శవంలా ఉన్నావంటూ కామెంట్లు పెడుతున్నారు. అభిమానం అంటే ఇలా కూడా ఉండేవారున్నారా అంటూ పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.