ఫేస్ బుక్ లో ఈ సమాచారం పొందుపరచకండి
- మీ ఫోన్ నంబర్లు, లాగిన్ ఐడిలు - ఆధార్, పాస్ పోర్ట్ తదితర గుర్తింపు కార్డ్ వివరాలు - పుట్టిన తేదీ.. దీనితో చాలా చిక్కులు ఉత్పన్నం అవుతాయి మీ బేంక్ ఖాతా వివరాలు దొరుకుతాయి - మీ పిల్లలు చదువుతున్న స్కూళ్ళ వివరాలు, వాళ్ల స్కూల్, కాలేజ్ రాకపోకల దార్లు వాటి వివరాలు - మీ లొకేషన్ టాగ్ చెయ్యకపోవడము అత్యుత్తమం - మీ వ్యక్తిగత వివరాలు, ఫోటోలు (కుటుంబపరమైన) పెట్టకపోవడము ఉత్తమము - సెలవు దినాల్లో ఖాళీగా ఉండే సమయాల్లో సింగిల్ గా లాంగ్ రైడ్లు వెళుతున్నట్టు, సింగిల్ గా ఉంటున్నట్టు వివరాలు వెళ్ళే దార్లూ ఇవ్వకపోవడము శ్రేయస్కరము చివరగా, అసలు మన సహచరుల్నే నమ్మలేని రోజులివి, అలాంటిది ఫేస్ బుక్ లో పరిచయం అయ్యి సన్నిహితులు గా మారే వారితో చాలా జాగ్రత్త గా వుండాలి. ప్రతి అడుగూ ఆచి తూచీ వేయాలి.