Saturday, August 24, 2019
Follow Us on :

రాయుడు అవుట్.. ఆ 15 మంది ఎవరంటే..?

By BhaaratToday | Published On Apr 15th, 2019

ప్రస్తుతం ఐపీఎల్ ను ఆస్వాదిస్తున్న క్రికెట్ అభిమానులను అలరించడానికి.. మరి కొద్ది రోజుల్లో ఇంగ్లాండ్ లో వరల్డ్ కప్ మొదలుకాబోతోంది. వరల్డ్ కప్ కు పంపే జట్లకు సంబంధించిన తుది జాబితాను పలు దేశాల క్రికెట్ బోర్డులు ఇప్పటికే ప్రకటించాయి. తాజాగా భారత్ కూడా జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టులో తెలుగు తేజం అంబటి రాయుడు స్థానాన్ని సంపాదించలేకపోయాడు. ఇక రిషబ్ పంత్ కు కూడా స్థానం లభిస్తుందని భావించారు.. కానీ అతడికి అదృష్టం వరించలేదు. 

ప్రపంచకప్ లో ఆడబోయే 15 మందితో కూడిన జట్టు వివరాలు ఇవే: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, విజయ్ శంకర్, ధోనీ (వికెట్ కీపర్), కేదార్ జాధవ్, దినేశ్ కార్తీక్ (సెకండరీ వికెట్ కీపర్), యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాా, మొహమ్మద్ షమీ