Tuesday, October 15, 2019
Follow Us on :

విశాఖ రైల్వే జోన్‌కు సౌత్ కోస్ట్‌గా నామ‌క‌ర‌ణం

By BhaaratToday | Published On Feb 28th, 2019

- దేశంలో 18వ రైల్వే జోన్‌
- ఆరు ద‌.మ రైల్వే డివిజ‌న్లు

కేంద్ర ప్ర‌భుత్వం ఏపీ ప్ర‌జ‌ల‌కు రైల్వే జోన్ ప్ర‌క‌టించ‌డంతో హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు ఏపీ ప్ర‌జ‌లు. ఎన్నో ఏళ్లుగా రైల్వే జోన్ కోసం చేస్తున్న పోరాటానికి ఫ‌లితం ల‌భించింది. దేశంలో ఇప్పటివరకు 17 రైల్వే జోన్లు ఉన్నాయి. రైల్వే డివిజన్ల విస్తృతి, పరిమాణం, పనిభారం, అవకాశం, ట్రాఫిక్, పాలన అవసరాల అధారంగా రైల్వే జోన్లు ఏర్పాటు చేశారు. చివరిగా 2003–04లో రైల్వే జోన్లను పునర్‌ వ్యవస్థీకరించారు. ప్రస్తుతం ముంబై కేంద్రంగా సెంట్రల్‌ రైల్వే, కోల్‌కతా కేంద్రంగా ఈస్టర్న్‌ రైల్వే, హజీపూర్‌ కేంద్రంగా ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే, భువనేశ్వర్‌ కేంద్రంగా ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే, న్యూఢిల్లీ కేంద్రంగా నార్తర్న్‌ రైల్వే, అలహాబాద్‌ కేంద్రంగా నార్త్‌ సెంట్రల్‌ రైల్వే, గోరఖ్‌పూర్‌ కేంద్రంగా నార్త్‌ ఈస్టర్న్‌ రైల్వే, గౌహతి కేంద్రంగా నార్త్‌ ఈస్ట్‌ ఫ్రాంటియర్‌ రైల్వే, జైపూర్‌ కేంద్రంగా నార్త్‌ వెస్టర్న్‌ రైల్వే, చెన్నై కేంద్రంగా సదరన్‌ రైల్వే, సికింద్రాబాద్‌ కేంద్రంగా సౌత్‌ సెంట్రల్‌ రైల్వే , కోల్‌కతా కేంద్రంగా సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వే, బిలాస్‌పూర్‌ కేంద్రంగా సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే, హుబ్లీ కేంద్రంగా సౌత్‌ వెస్టర్న్‌ రైల్వే, ముంబై కేంద్రంగా వెస్టర్న్‌ రైల్వే, జబల్‌పూర్‌ కేంద్రంగా వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వే, కోల్‌కతా కేంద్రంగా మెట్రో రైల్వే జోన్‌లు పని చేస్తున్నాయి. తాజాగా కేంద్రం ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే 18వ జోన్‌ కానుంది. 
 గా
ద.మ. రైల్వేలో ఆరు డివిజన్లు...
సికింద్రాబాద్‌ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో 6 డివిజన్లు ఉన్నాయి. సికింద్రాబాద్, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు, హైదరాబాద్, నాందేడ్‌ డివిజన్లు ఉన్నాయి. వీటిలో విజయవాడ, గుంతకల్లు, గుంటూరు తాజాగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లోకి వెళ్తాయి. కొత్త రైల్వే జోన్‌ పరిధిలో జోనల్‌ స్థాయి రైల్వే ఆసుపత్రి, ఆరోగ్య కేంద్రాలు, రైల్వే పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటయ్యే అవకాశం ఉంటుంది.