Friday, December 06, 2019
Follow Us on :

20 ఏళ్ల పాటూ యోగి ఆదిత్యనాథ్ ను వెంటాడిన కేసు.. ఇప్పుడేమో..!

By BhaaratToday | Published On Jul 17th, 2019

20 ఏళ్ల నాటి కేసులో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు ఊరట లభించింది. 20 ఏళ్ల పాటూ యోగి ఆదిత్యనాథ్ ను వెంటాడిన కేసులో ఓ స్పెషల్ కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పును ఇచ్చింది. 1999లో మహరాజ్ గంజ్ జిల్లాలో జరిగిన పోలీస్ కానిస్టేబుల్ సత్యప్రకాశ్ యాదవ్ హత్య కేసులో యోగి ఆదిత్యనాథ్ కూడా నిందితుడిగా ఉన్నారు. ఈ కేసును విచారించిన అలహాబాద్ హైకోర్టుకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు కేసును డిస్మిస్ చేసింది. కేసును దర్యాప్తు చేసిన సీబీసీఐడి కోర్టుకు చివరి నివేదికను అందజేస్తూ యోగికి క్లీన్ చిట్ ఇచ్చింది. 

1999 లో సమాజ్ వాదీ పార్టీ నేత తలత్ అజీజ్ సెక్యూరిటీగా పోలీస్ కానిస్టేబుల్ సత్యప్రకాశ్ యాదవ్ ఉన్నారు. ఆ సమయంలో యోగి అతని అనుచరులు తలత్ అజీజ్ పై జరిపిన కాల్పుల్లో సత్యప్రకాశ్ మరణించాడని.. ఇందుకు కారణం యోగి ఆదిత్యనాథ్ అంటూ కేసు నమోదు చేశారు. ఇన్నేళ్ల పాటూ వెంటాడిన ఈ కేసులో యోగికి ఎటువంటి సంబంధం లేదని తీర్పు వచ్చింది.