Tuesday, September 24, 2019
Follow Us on :

జవాన్.. ఎంత పని చేశావయ్యా..!

By BhaaratToday | Published On Mar 21st, 2019

చిన్న వాగ్వివాదాం.. ఆ జవాన్ సహనాన్ని కోల్పోయేలా చేసింది.. అంతే తన ముగ్గురు సహచర జవాన్లపై తూటాల వర్షం కురిపించాడు. తన సర్వీసు రైఫిల్‌తో కాల్పులు జరిపాడు. ఈ ఘటన కాశ్మీర్ లో కలకలం రేపింది. 

Image result for three crpf jawans

సీఆర్ఫీఎఫ్‌ 187వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్‌ అజిత్‌ కుమార్‌ కశ్మీర్‌లో నిధులు నిర్వర్తిస్తున్నారు. బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ముగ్గురు సహచరులకు అజిత్‌తో వాగ్వాదం జరిగింది. దీంతో సహనం కోల్పోయిన అజిత్‌ తన తుపాకీతో ముగ్గురు సహచరుల్ని కాల్చి, తానూ ఆత్మహత్యకు యత్నించాడు. అధికారులు వీరిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, ముగ్గురు జవాన్లు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్దారించారు. అజిత్‌ కుమార్‌ కాన్పూర్‌కు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. మృతి చెందిన వారు రాజస్థాన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ ఆర్ పొకార్మల్, ఢిల్లీకి చెందిన యోగేంద్ర శర్మ, హర్యానాకు చెందిన ఉమెద్ సింగ్‌లుగా గుర్తించారు. దాడికి పాల్పడిన కుమార్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. 

Image result for three crpf jawans