Monday, December 09, 2019
Follow Us on :

ముగ్గురు దొరికారు.. నాలుగు AK-56, రెండు AK-47 స్వాధీనం..!

By BhaaratToday | Published On Sep 12th, 2019

భారత్ లో ఉగ్రదాడులు జరపాలని తీవ్రవాద సంస్థలకు ఆదేశాలు వచ్చాయని ఇంటెలిజెన్స్ కు సమాచారం అందింది. దీంతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా ముగ్గురు తీవ్రవాదులను అదుపు లోకి తీసుకున్నారు. 

జమ్మూ కాశ్మీర్ లోని కథువా ప్రాంతంలో ఓ ట్రక్కును జల్లెడ వేయగా భారీ ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 8 గంటల సమయంలో  జమ్మూ-పఠాన్ కోట్ హైవే మీదుగా వెళుతున్న ట్రక్కులో నుండి నాలుగు AK-56, రెండు AK-47 స్వాధీనం చేసుకున్నారు. అలాగే 6 మ్యాగజైన్లు, 180 రౌండ్ల బుల్లెట్స్ కూడా దొరికాయి. 11000 రూపాయల క్యాష్ కూడా దొరికిందని పోలీసులు తెలిపారు. పట్టుబడిన ముగ్గురినీ జైష్-ఏ-మొహమ్మద్ కు చెందిన తీవ్రవాదులుగా పోలీసులు భావిస్తున్నారు. కాశ్మీర్ నుండి పంజాబ్ లోని బమ్యాల్ కు వెళుతుండగా వీరు పట్టుబడ్డారు. పోలీసులు విచారణ చేయనున్నారు.