Wednesday, October 16, 2019
Follow Us on :

విశాఖ‌లో విషాదం..న‌లుగురు మృతి

By BhaaratToday | Published On Feb 25th, 2019

జిల్లాలో  పెనువిషాదం చోటుచేసుకుంది. ఓ డబ్బాలోని గుర్తు తెలియని ద్రావణాన్ని మద్యంగా భావించిన కొందరు వ్యక్తులు దానిని సేవించారు. అది ప్ర‌మాద‌క‌ర‌మైన‌ది కావడంతో న‌లుగురు ప్రాణాలు విడిచారు. మరో 8 మంది తీవ్ర అస్వస్థతకు గుర‌య్యారు. ఈ ఘటన గాజువాకలోని సుందరయ్య కాలనీలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. అపస్మారక స్థితిలో ఉన్న బాధితులను కేజీహెచ్‌ ఆస్పత్రికి తరలించారు. వీరిలో న‌లుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఘటన గురించి జిల్లా కలెక్టర్‌ కె.భాస్కర్‌ మీడియాతో మాట్లాడారు. బాధితులు తాగిన ద్రావణం ఏమిటో తెలియడం లేదని, దాంతో చికిత్సకు విఘాతం కలుగుతోందని అన్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను సూచించామని తెలిపారు. ఘటనపై ఎక్సైజ్‌, పోలీస్ అధికారుల దర్యాప్తునకు ఆదేశించామని వెల్లడించారు. మృతి చెందిన వారిలో అసనాల రమణమ్మ(70), వాడపల్లి అప్పడు(65), కొండోడు(65), సండ్ర అప్పలమ్మ(60) ఉన్నారు.