Wednesday, November 20, 2019
Follow Us on :

1915నుండి గోడలో దాగిన విగ్రహం.. ప్రతి ఒక్కరూ చదవాల్సిందే

By BhaaratToday | Published On Apr 29th, 2019

1915.. దాదాపుగా 100 ఏళ్ల పైమాటే..! అప్పుడు దొంగతనానికి గురైన అమ్మవారి విగ్రహం.. ఇప్పుడు బయటపడింది. 700 ఏళ్ల చరిత్ర కలిగిన విగ్రహం 1915 నుండి ఒక గోడలో దాచి ఉంచారు.. అక్కడ విగ్రహం ఉందని కొందరికే తెలుసు.. ఆ కుటుంబం లోని వ్యక్తులు చనిపోతుంటే కూడా ఎన్నో పూజలు చేస్తూ వచ్చారు.. గోడకు కూడా పూజలు చేశారు.. కానీ ఆ గోడలో విగ్రహం ఉందన్నది ప్రపంచానికి తెలీకుండా చేశారు. ఇప్పుడు అది బయటపడడం సంచలనం అయింది. 

Image result for madurai

తమిళనాడులోని మధురై నగరంలో ఉన్న మేలూరు ఆలయం నుండి 1915లో ద్రౌపది అమ్మన్ అమ్మవారి విగ్రహం ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. అప్పట్లో దీనిపై బ్రిటీష్ అధికారులకు ఫిర్యాదు చేశారు. బ్రిటీషర్లు విగ్రహం కోసం బాగానే వెతికారట.. కానీ దొరకలేదట. దీంతో కాలక్రమేణా విగ్రహం గురించి మరచిపోయారు. అయితే ఒకటిన్నర అడుగుల ఎత్తైన ద్రౌపతి అమ్మన్ విగ్రహాన్ని ఆలయానికి పోలీసులు ఆదివారం అందజేశారు.  మురుగేశన్ అనే 60 ఏళ్ల వ్యక్తి ద్రౌపది అమ్మన్ విగ్రహాన్ని భద్రంగా తీసుకువచ్చాడట..! అయితే ఈ విగ్రహం తెచ్చిచ్చిన మురుగేశన్ తాత కరుప్పుస్వామి 100 క్రితం ఆ ఆలయంలోనే పూజారిగా ఉద్యోగం చేశాడట.  

Image result for 700-year-old idol stolen by priest
మురుగేశన్ తాత కరుప్పుస్వామి ఒకరోజు తోటి పూజారితో గొడవ పెట్టుకున్నాడట. అయితే ఆ పూజారి మీదకు దొంగతనం నెట్టాలని భావించిన కురుప్పుస్వామి..  ఆ విగ్రహాన్ని ఎత్తుకెళ్లాడు. ఇక అమ్మవారి విగ్రహం ఇంట్లో పెట్టుకున్నాడు కానీ.. ఏంచేయాలో తెలియక గోడ పగులగొట్టి దాంట్లో దాచాడు. తన తాత, తండ్రి ప్రతిరోజూ ఆ గోడకు పూజలు చేయడం మురుగేశన్ తన బాల్యంలో గమనించాడు. ఆ గోడను భయంగా గమనించడం కూడా మురుగేశన్ కు ఇప్పటికీ గుర్తు ఉంది. ఆ తర్వాత మురుగేశన్ కుటుంబం అక్కడి నుండి వేరే చోటకు వెళ్ళిపోయింది.       

కానీ ఇటీవలి కాలంలో మురుగేషన్ కుటుంబంలో చాలా మందికి వింత వ్యాధులతో మరణిస్తున్నారు. విగ్రహాన్ని దాచినందుకే తమ కుటుంబానికి అలా జరుగుతోందని మురుగేశన్ భావించాడు. నమ్మక్కళ్‌లో స్థిరపడిన మురుగేశన్ ఇటీవల ఆలయాన్ని సందర్శించి.. అమ్మవారి విగ్రహం గురించి తెలియజేశాడు. ఈ విగ్రహాన్ని తన పూర్వీకుల ఇంటి గోడలో ఉంచినట్టు తెలిపాడు. వెంటనే పోలీసులకు విషయాన్ని తెలిపారు. 

అప్పట్లో మురుగేశన్ కుటుంబం నివసించిన ఇంట్లో ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు. విషయం ఆ ఇంటి ఓనర్ కు చెప్పగా.. విగ్రహం కోసం గోడను పగులగొడితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆ ఇంటి యజమాని మచాకళి రాతపూర్వకంగా పోలీసులకు హామీ ఇచ్చాడు. ఆ గోడను బద్దలు కొట్టగా ఆలయ రికార్డుల్లో చెప్పినట్లుగా అదే మూడో కన్ను ఉన్న  అమ్మవారి విగ్రహం బయటకు తీశారు. ఆలయానికి విగ్రహాన్ని తీసుకొని వెళ్లారు. 
Image result for 700-year-old idol stolen by priest