Wednesday, October 16, 2019
Follow Us on :

గంటకు 300 కిలోమీటర్ల వేగంతో వెళ్లే అపాచి హెలికాప్టర్లు మన సొంతం..!

By BhaaratToday | Published On Sep 3rd, 2019

గత కొద్దిరోజులుగా భారత్- పాక్ సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే..! అయితే ఇలాంటి తరుణంలో భారత్ ఆర్మీ చెంతకు అపాచి హెలికాప్టర్లు చేరాయి.  అత్యాధునిక అపాచి ఏహెచ్-64 అటాక్ హెలికాప్టర్లు భారత వైమానికదళం(ఐఏఎఫ్)లో చేరాయి. అమెరికా నుంచి 22 అపాచి అటాక్ హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు భారత్ 2015లో ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా 8 హెలికాప్టర్లను అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ భారత్ కు అందించింది.పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో వాయుసేన చీఫ్ బీఎస్ ధనోవా సమక్షంలో ఈ కార్యక్రమం పూర్తయింది. ఇద్దరు పైలెట్లు నడిపే ఈ అపాచి హెలికాప్టర్ ను రాత్రిపూట నడిపేందుకు నైట్ విజన్ సౌకర్యం ఉంది. 30 ఎంఎం ఎం230 చైన్ గన్ ను ఈ విమానాలకు అమర్చారు. ఈ హెలికాప్టర్ల ద్వారా ఏజీఎం 114, హైడ్రా 70 మిస్సైళ్లను ప్రయోగించవచ్చు. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలవు.  ప్రస్తుతం అమెరికాతో పాటు జపాన్, ఇజ్రాయెల్, సింగపూర్, యూఏఈ దేశాలు మాత్రమే ఈ హెలికాప్టర్లను వాడుతున్నాయి. ప్రస్తుతం ఆ లిస్టులోకి మనం కూడా చేరిపోవడం శత్రుదేశాల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. 

Image result for apache helicopter india

Image result for apache helicopter india