Tuesday, May 21, 2019
Follow Us on :

భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తారా అని ఆమిర్ ఖాన్ కు ప్రశ్న..?

By BhaaratToday | Published On Mar 14th, 2019

అమిర్ ఖాన్.. బాలీవుడ్ లో ఎన్నో వైవిధ్యభరితమైన సినిమాలను రూపొందించి.. ఎన్నో అవార్డులతో పాటూ భారీ హిట్స్ ను కూడా అందుకొన్నారు. ఈరోజు ఆయన  54వ పుట్టినరోజు. ముంబై బంద్రాలోని తన నివాసంలో భార్య కిరణ్ రావు, అభిమానులు, మీడియా సమక్షంలో పుట్టినరోజును జరుపుకున్నారు ఆమిర్.  అలాగే జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. అయితే ఆయనకు ఓ ఆసక్తికరమైన ప్రశ్న మీడియా సమావేశంలో ఎదురైంది. 

ఎన్నికల్లో మీరు బీజేపీకి మద్దతు తెలుపుతారా? అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు.  తాను ఏ పార్టీకి మద్దతు ప్రకటించనని చెప్పుకొచ్చారు. తాను ఓటు హక్కు యొక్క విలువను తెలియజేయడానికి వచ్చానని అంతేకాని రాజకీయాల గురించి మాట్లాడడానికి కాదని ఆయన అన్నారు.  రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. ఎన్నికల సమయంలో ఎన్నారైలు రావడానికి ఇబ్బందులు ఎదురవుతోందని ఎన్నికల కమిషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరారు.