Monday, November 18, 2019
Follow Us on :

ఆవిరి.. ఇంతకీ ఆ కథ ఏంటి అనుకుంటున్నారా..?

By BhaaratToday | Published On Oct 15th, 2019

హార్రర్ చిత్రాల దర్శకుడు రవిబాబు నటిస్తు దర్శరత్వం వహిస్తున్న సినిమా ఆవిరి...ఈ సినిమాను నవంబర్ 1 న విడుదల చేయనున్నారు...ఈ సినిమాను వాస్తవిక కధ ఆధారంగా తెరకెక్కిస్తున్నారని అంటున్నారు...ఇంతకీ ఆ కధ ఏంటి అనుకుంటున్నారా..? 

తెలుగులో హార్రర్ చిత్రాలు పరిచయం చేసిన డర్శకుల్లో రవిబాబు ప్రముఖులు...ఆయన వినూత్నంగా చేసిన ప్రయోగం అదిగో సినిమా విఫలం అయిన తరువాత ఆయన అవును వంటి హిట్ అందించిన హార్రర్ జోనర్ నే ఎంచుకున్నారు...ఆ హార్రర్ జోనర్ లోనే తాజాగా ఆవిరి సినిమాను తెరకెక్కిస్తున్నారు..ఈ సినిమాలోను ఆయన కంటికి కనబడని దెయ్యం అనే కాన్సెప్ట్ నే ఫాలో అవుతున్నట్లు ట్రైలర్ కన్వే చేసింది...

 తాజాగా విడుదల చేసిని ఆవిరి మూడు టీజర్స్ కుడా సినిమా పై ఆసక్తిని రేపాయి... ఎక్కడా భయంకరంగా దెయ్యం కనబడకుండా వస్తువులు వాటంతట అవే కదలడం ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేశాయి...అయితే ఈ సినిమాలో ఒక చిన్న పిల్ల నేపధ్యంలో తెరకెక్కుతోంది...ఆ చిన్న పిల్లతో దెయ్యం స్నేహం చేస్తుంది...ఆ తరువాత ఆ అమ్మాయిని ఆత్మ ఎటు తీసుకెళ్ళింది..? ఏం చేసింది అనేది కథా నేపధ్యం...?

ఇక రవిబాబు కాస్త గ్యాప్ తీసుకుని రాసుకున్న కథను ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించారనే విషయాన్ని కన్వే చేసే ప్రయత్నాన్ని చేశారు... అంతేకాదు చాలా సెక్యూర్డ్ హౌజ్ నుండి పాప ఎలా తప్పించుకుందనే సస్పెన్స్ ను కుడా క్రియేట్ చేశారు..అయితే సినిమాలో అవును ఛాయలు ఎక్కువగా కనపడుతున్నట్లు మేకింగ్ ఉంది..  

ఆవిరి చిత్రాన్ని దర్శకుడు రవిబాబు తనదైన శైలిలో చాలా తక్కువ లొకేషన్స్ లో వీలైనంత తక్కువ మంది కాస్టింగ్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు...అటు పై సినిమాలో వాటికి అవే కదిలే వస్తువులు ఆసక్తిని రేకెత్తిస్తాయి...మొత్తానికి ఆవిరి ట్రైలర్ ద్వార రవిబాబు భయపెట్టే ప్రయత్నం అంతగా వర్కౌట్ కాలేదని అంటున్నారు..అయితే సినిమా మాత్రం ఆయన వే ఆఫ్ మేకింగ్ లో ఉంటుందని కన్వే అయ్యింది..

 ఈ సినిమాను గతంలో వరంగల్ కలెక్టర్ అమ్రపాలి తన ఇంట్లో ఏదో ఉందని చెప్పిన సంఘటన అందరికి గుర్తుంటుంది..ఆమె నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని అంటున్నారు..అయితే మొత్తం ఆ స్టోరీ కాదని, ఆ లైన్ తో రవిబాబు ఓన్ గా ఈ కధను క్రియేట్ చేసుకున్నారట...