Tuesday, October 15, 2019
Follow Us on :

ఎంత దారుణం..! ఐదుగుర్ని పొట్టనబెట్టుకున్న డబుల్ బెడ్ రూం ఇళ్లు..!!

By BhaaratToday | Published On Jan 31st, 2019

మేడ్చల్ జిల్లాలో దారుణం జరిగింది. కీసర మండలం రాంపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో ప్రమాదం జరిగింది. అక్కడ పని చేస్తున్న ఐదుగురు కూలీలు ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందారు. దీంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే నిర్మాణం చేపట్టే వారు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోలేదని అక్కడున్న కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.