Saturday, October 19, 2019
Follow Us on :

హిందీ అర్జున్ రెడ్డి సినిమా షూటింగ్ లో ప్రమాదం.. ఒకరి మృతి..!

By BhaaratToday | Published On Jan 25th, 2019

తెలుగులో బ్లాక్ బస్టర్ గా నిలిచిన అర్జున్ రెడ్డి సినిమాను బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరుతో తెరకెక్కిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా హిందీలోనూ దర్శకత్వం వహిస్తున్నారు. హీరో హీరోయిన్లుగా షాహిద్ కపూర్, కియారా అద్వానీ నటిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ లో ప్రమాదం చోటుచేసుకోవడంతో ఒక వ్యక్తి మరణించాడు. ఉత్తరాఖండ్ లోని ముస్సోరిలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆ సినిమా సెట్స్ లో ప్రమాదవశాస్తూ ఒకరు మృతి చెందారు. 

 

ఉత్తరప్రదేశ్ కు చెందిన 35 సంవత్సరాల రామ్ కుమార్ అనే వ్యక్తి ప్రాణాలను కోల్పోయాడు. సినిమా యూనిట్ బస చేస్తున్న ఫైవ్ స్టార్ హోటల్ లో ఈ ప్రమాదం జరిగింది. షూటింగ్ కు వెళ్లే ముందు జరిగిన ప్రమాదం రామ్ కుమార్ ను పొట్టన పెట్టుకుంది. కుమార్ జనరేటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. జనరేటర్ లో వాటర్ లెవెల్ ఎంత ఉందో తెలుసుకోవాలని ప్రయత్నించే సమయంలో అతడు జనరేటర్ ఫ్యాన్ కు ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది. దీంతో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. తల భాగంలో తీవ్రమైన రక్త స్రావం జరగడంతో అతడిని డెహ్రాడూన్ లోని మాక్స్ ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. కొద్ది గంటల పాటూ అతడికి వెంటిలేటర్ మీద చికిత్స అందించారు. అయితే గాయాలు తీవ్రమైనవి కావడంతో అతన్ని కాపాడలేకపోయారు. ఈ ఘటనతో చిత్ర బృందం తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది. రామ్ కుమార్ కుటుంబానికి తాము అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.