Sunday, December 15, 2019
Follow Us on :

తరుణ్ కు కాదు రాజ్ తరుణ్ కు యాక్సిడెంట్.. రాజ్ తరుణ్ ఎక్కడ..?

By BhaaratToday | Published On Aug 20th, 2019

ఔటర్ రింగ్ రోడ్డ్ పై యాక్సిడెంట్ అయిన కారులో ఉన్నది హీరో తరుణ్ కాదని.. యంగ్ హీరో రాజ్ తరుణ్ అని తెలుస్తోంది. మొదటి నువ్వేకావాలి ఫేమ్ తరుణ్ కు యాక్సిడెంట్ అయ్యిందని మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే తరుణ్ స్పందించాడు. తనకు ఎటువంటి సంబంధం లేదని అన్నాడు. తాను రాత్రంతా ఇంట్లోనే ఉన్నానని, ఎక్కడికీ వెళ్లలేదని తరుణ్  చెప్పాడు. మీడియాలో వచ్చిన వార్తలను చూసి, తన క్షేమసమాచార నిమిత్తం వందల మంది ఫోన్ చేస్తున్నారని..  తాను క్షేమంగా ఉన్నానని, ప్రమాదం జరిగిన కారు తనది కాదని తరుణ్ అన్నాడు.

దీంతో ప్రమాదం జరిగింది రాజ్ తరుణ్ కే నని తెలుస్తోంది.  ప్రమాదం తరువాత మరో కారులో వెళ్లిపోగా కొందరు అతని పేరును తరుణ్ గా పేర్కొనడంతోనే, మీడియా సైతం పొరపాటు పడింది.  దీనిపై తరుణ్ వివరణ ఇవ్వడంతో.. కారులో ఉన్నది రాజ్ తరుణ్ అని తెలుస్తోంది. రాజ్ తరుణ్ ఎక్కడ ఉన్నాడా అని అందరూ టెన్షన్ పడుతున్నారు. యాక్సిడెంట్ తరువాత రాజ్ తరుణ్ ఎక్కడికి వెళ్లాడన్న విషయం ఇంకా తెలియరాలేదు. రాజ్ తరుణ్‌ తన వాల్వో కారు (టీఎస్ 09 ఈఎక్స్ 1100)లో హైదరాబాద్ కు వస్తున్న వేళ, అల్కాపూర్ దగ్గర కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.