Tuesday, September 24, 2019
Follow Us on :

ఇది చాలా కష్టమైన ప్రశ్న: జగపతిబాబు

By BhaaratToday | Published On Apr 14th, 2019

సీనియర్ నటుడు జగపతిబాబు సినీ పరిశ్రమలో ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను వెల్లడించారు. అందరూ తనను ఉద్దేశించి 'స్త్రీలోలుడు' అని భావిస్తారని, అది సరికాదని, ఆ మాటంటే తాను ఎప్పుడూ ఒప్పుకోనని స్పష్టం చేశారు. అమ్మాయిల పిచ్చి అంటే అది వేరే అర్థం వస్తుందని, చాలామంది దాని అర్థం తెలియకుండా వాడుతుంటారని జగపతిబాబు చెప్పుకొచ్చారు. సరసానికి, అమ్మాయిల పిచ్చికి, ప్రేమకి చాలా తేడా ఉందని, తాను తల్లి నుంచి ప్రతి స్త్రీని ప్రేమిస్తానని, అందుకే స్త్రీలను ప్రేమిస్తుంటానని ఎప్పుడూ చెబుతుంటానని జగపతిబాబు వివరించారు. ఇండస్ట్రీలో మీరు ఏ హీరోయిన్ తో నటించడాన్ని బాగా ఆస్వాదిస్తారంటూ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, ఇది చాలా కష్టమైన ప్రశ్న…ఒకరి పేరంటూ ప్రత్యేకంగా చెప్పలేనని, రమ్యకృష్ణ చాలా మంచి అమ్మాయి అని, ఆమె వ్యక్తిగతంగా కూడా డబ్బులు జాగ్రత్త, వృథా చేసుకోవద్దు అంటూ సలహాలు ఇస్తూ గైడ్ చేస్తుందని వివరించారు. ఇక సౌందర్య గురించి చెబుతూ 'స్వచ్ఛమైన అమ్మాయి' అంటూ ఒకే మాట చెప్పారు.
2008-09 నుంచి 2012 వరకు చీకటిరోజులుగా పేర్కొన్నారు. ఆ సమయంలో డబ్బు కోసం పరమచెత్త సినిమాలు కూడా చేశానని, నిర్మాతలు ఎంతిస్తే అంత తీసుకుని నటించానని గుర్తు చేసుకున్నారు. ఒకరకంగా మనసు చంపుకుని ఆ విధంగా చేయాల్సి వచ్చిందని జగపతిబాబు బాధను వ్యక్తం చేశారు. కానీ అప్పటి పరిస్థితుల దృష్ట్యా ఆవిధంగా చేయకతప్పలేదని అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో అలాంటి దుర్దశ ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆమని, కల్యాణి, ప్రియమణి కూడా తనతో అనేక చిత్రాల్లో నటించారని, ఆమని ఓ నటిగా ఎంతో గొప్పదని అన్నారు. ఆమెతో నటించిన శుభలగ్నం చిత్రం తన కెరీర్ లో మంచి సినిమాగా నిలిచిపోతుందని, అందులో ఆమని నటన అద్భుతం అని పేర్కొన్నారు