Saturday, October 19, 2019
Follow Us on :

జగన్ అది గుర్తించారు.. అందుకే..

By BhaaratToday | Published On Aug 4th, 2019

కలలో కూడా ఇలాంటి పదవి వస్తుందని తాను అనుకోలేదని సినీ నటుడు, ఎస్‌వీబీసీ ఛానెల్ చైర్మన్ పృథ్వీ అన్నారు. నేడు మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. తనకు రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీ వైసీపీ అని.. తొమ్మిది సంవత్సరాల కాలంలో పార్టీ అభివృద్ధి కోసం సామాన్య కార్యకర్తగా పనిచేశానని.. అది జగన్ గుర్తించారని తెలిపారు. జగన్  ముఖ్యమంత్రి కావాలని ఎన్నో మొక్కులు మొక్కుకున్నానని, తిరుమలలో రాజకీయాలు మాట్లాడనని, అమరావతిలోనే రాజకీయాలు మాట్లాడతానని చెప్పారు. గతంలో జరిగిన అవినీతిని వెలికితీస్తానని, చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. తనకు, పోసానికి ఎలాంటి విబేధాలు లేవన్న పృథ్వీ.. నెలలో 20 రోజులు తిరుపతిలోనే  ఉంటానని అన్నారు.