Thursday, July 18, 2019
Follow Us on :

ఊసరవెల్లి, శక్తి సినిమాల విలన్ పై ఉన్న కేసు కొట్టివేత

By BhaaratToday | Published On Jun 17th, 2019

విద్యుత్ జమ్వాల్‌.. ఈ బాలీవుడ్ నటుడు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయమే..! ఎన్టీఆర్ ఊసరవెల్లి, శక్తి సినిమాల్లో విలన్ గా అతడు నటించి ఆకట్టుకున్నాడు. ఇక ఈ కండల వీరుడు 'కమాండో' సినిమాతో బాలీవుడ్ లో హిట్ ను అందుకొని ప్రస్తుతం దాని సీక్వెల్ లో నటిస్తూ ఉన్నాడు. అయితే ఓ కేసులో అతడిని నిర్దోషిగా తేల్చింది కోర్టు. పన్నెండేళ్ల కింద నమోదైన ఆ కేసులో విద్యుత్ జమ్వాల్‌ను బాంద్రా మేజిస్ట్రేట్ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. 

2007 ఆగస్టు 31న విద్యుత్ జమ్వాల్ తన ఫ్రెండ్స్ తో కలిసి ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్‌లో పార్టీ చేసుకున్నాక బయటకొస్తుండగా తనపై దాడి చేశారని జుహూకు చెందిన వ్యాపారి రాహుల్ సూరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జమ్వాల్ తనపై దాడి చేయడమే కాకుండా..బాటిల్ తో తలపై కొట్టాడని రాహుల్‌ సూరి కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణలో భాగంగా విద్యుత్ జమ్వాల్‌కు కోర్టు నోటీసులు జారీచేసింది. దీనిపై గతంలో అతనిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేశారు. అయితే విద్యుత్ జమ్వాల్ దాడికి పాల్పడినట్లు సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో కోర్టు జమ్వాల్‌ను నిర్దోషిగా తేల్చింది.