Tuesday, June 18, 2019
Follow Us on :

బాల్ థాక్రే మనవడు ఆదిత్య థాక్రే తో దిశా పటానీ డిన్నర్ డేట్..!

By BhaaratToday | Published On Jun 11th, 2019

దిశా పటానీ.. తెలుగులో లోఫర్ సినిమాలో నటించింది. బాలీవుడ్ లో ఎం.ఎస్.ధోనీ, భాగీ-2, భరత్ సినిమాల్లో మెప్పించింది. ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం శివ సేన అధినేత బాల్ థాక్రే మనవడు ఆదిత్య థాక్రేతో ఆమె డేటింగ్ చేస్తోందన్న వార్తలు వస్తున్నాయి. ఆదిత్య థాక్రే శివ సేన యూత్ వింగ్ అయిన 'యువ సేన' బాధ్యతలు మోస్తుండడమే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా ఎదుగుతున్నాడు. 

Image result for disha patani with aditya thackeray

ఆదిత్య థాక్రేతో కలిసి దిశా పటానీ డిన్నర్ డేట్ కు వెళ్లడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నిలిచింది. ఆదిత్య థాక్రే తో కలిసి ఆమె డిన్నర్ డేట్ కు వెళ్లడం కొందరు నెటిజన్లకు నచ్చలేదు. దిశా గతంలో బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ తో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆమె ఇప్పుడు ఆదిత్య థాక్రే తో చెట్టపట్టాలు వేసుకొని తిరగడంపై కొందరు పెదవి విరుస్తున్నారు. గతంలో వీరిద్దరూ ఇలా తిరగడం కూడా పెద్ద సెన్సేషన్ అయింది. 

Related image