Thursday, December 12, 2019
Follow Us on :

రెమ్యునరేషన్ పెంచేసిన ర‌ష్మిక మంద‌న్న‌

By BhaaratToday | Published On Jul 15th, 2019

న‌టి రష్మిక మందన్న వరుస హిట్లతో తెగ దూసుకెళ్తోంది. వరుస ఆఫర్లతో బిజీ బిజీగా ఉంటోంది. టాప్ హీరోయిన్ గా మారిపోవడంతో, తాజాగా తన రెమ్యునరేషన్ ను కూడా భారీగా పెంచేసింది. 'గీత గోవిందం' సినిమాకు రూ. 60 లక్షలు తీసుకున్న రష్మిక... కన్నడలో చేసిన ఓ చిత్రానికి రూ. 64 లక్షలు తీసుకుంది. ఇప్పుడు మహేశ్ బాబు సరసన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో ఆమె నటిస్తోంది. ఈ సినిమాకు ఆమె రూ. కోటి తీసుకున్నట్టు స‌మాచారం. విజయ్ సరసన రష్మిక నటించిన 'డియర్ కామ్రేడ్' చిత్రం ఈనెల 26న విడుదల కానుంది. తెలుగులో మూడు, కన్నడలో ఒక చిత్రం, తమిళ్ లో ఒక చిత్రంలో రష్మిక నటిస్తోంది.