Sunday, August 25, 2019
Follow Us on :

రామ్ ప్రసాద్ హత్యకేసులోని మిస్టరీ గురించి చెప్పిన హైదరాబాద్ జాయింట్ కమిషనర్

By BhaaratToday | Published On Jul 15th, 2019

 హైదరాబాద్ జాయింట్ కమిషనర్ శ్రీనివాసరావు స్టీల్ వ్యాపారి రాంప్రసాద్ హత్యకేసులోని మిస్టరీ గురించి మీడియా ముందు పెట్టారు. ఈ హత్యకు ప్రధాన సూత్రధారి కోగంటి సత్యమేనని.. తనకు రావాల్సిన డబ్బుల కోసమే రాంప్రసాద్‌ను హత్యకు కోగంటి సత్యం ప్లాన్ చేశారని హైదరాబాద్ జాయింట్ కమిషనర్ శ్రీనివాసరావు చెప్పారు. ఈ కేసులో అరెస్టు చేసిన నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు.

Image result for కోగంటి సత్యం

2003లో రాంప్రసాద్,  కోగంటి సత్యం ఇధ్దరూ కలిసి వ్యాపారం చేశారట.. వ్యాపారలావాదేవీల్లో భాగంగా కోగంటికి రూ.70 కోట్లను రాంప్రసాద్ బకాయిపడ్డాడని  హైదరాబాద్ జాయింట్ కమిషనర్ శ్రీనివాసరావు అన్నారు. ఈ నేపథ్యంలో వారి మధ్య వివాదం తలెత్తడంతో, పెద్దమనుషుల వద్దకు వెళితే, కోగంటికి రూ.23 కోట్లు చెల్లించాలని సెటిల్ మెంట్ జరిగింది. కానీ సెటిల్ చేసిన బకాయిని రాంప్రసాద్ ఇవ్వకపోవడంతో.. కోగంటి కక్ష్య పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే రాంప్రసాద్ ను హత్య చేయించాలనే నిర్ణయానికి వచ్చాడని తెలిపారు. కోగంటితో గొడవల వల్లే రామ్ ప్రసాద్ విజయవాడ వదిలి హైదరాబాద్ కు వచ్చారని చెప్పారు. రాం ప్రసాద్ హత్యకు రూ.10 లక్షల సుపారీ ఇచ్చేందుకు కోగంటి సత్యం ఒప్పుకున్నట్టు తమ విచారణలో తెలిసిందని శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. తనపై అనుమానం రాకుండా ఉండేందుకు, పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు కోగంటి యత్నించాడని అన్నారు. 
మిగిలిన వివరాల కోసం ఈ వీడియో చూడండి: