Monday, November 18, 2019
Follow Us on :

డ్యాన్స్ చేసిన అసదుద్దీన్ ఒవైసీ.. ఎందుకనుకుంటున్నారా..?

By BhaaratToday | Published On Oct 19th, 2019

ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇంతకూ ఆయన డాన్స్ చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే.. ఓటర్లను ఆకట్టుకోడానికే..! అసదుద్దీన్‌ ఔరంగాబాద్‌లోని పైథాన్‌గేట్‌ వద్ద జరిగిన ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడారు. అనంతరం స్టేజ్‌ దిగుతూ స్టెప్స్‌ వేశారు. తమ పార్టీ గుర్తు గాలిపటం ఎగరేస్తున్నట్లు ఆయన చేసిన డ్యాన్స్‌ చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 44 స్థానాల్లో ఎంఐఎం తన అభ్యర్థులను నిలిపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

ఎన్నికల ప్రచార ర్యాలీలో భారత ప్రధాని నరేంద్రమోదీపై అసదుద్దీన్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయం లోనే భారత ప్రధానికి వివాదాస్పద అంశాలు గుర్తుకు వస్తాయని విమర్శించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 44 స్థానాల్లో ఎంఐఎం తన అభ్యర్థులను నిలపగా వారిని గెలిపించుకోడానికి అసదుద్దీన్ పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు.