Saturday, October 19, 2019
Follow Us on :

ఎయిరిండియా విమానాన్ని హైజాక్ చేస్తామంటూ బెదిరింపులు

By BhaaratToday | Published On Feb 24th, 2019

గన్నవరం విమానాశ్రయం నుంచి వెళ్లే ఎయిరిండియా విమానాన్ని హైజాక్ చేసి పాకిస్తాన్‌కు మళ్లిస్తామంటూ ఓ గుర్తు తెలియని వ్య‌క్తి ఎయిర్‌పోర్టు అధికారులకు ఫోన్ చేశాడు. దీంతో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆదివారం ఉదయం ఓ ఫోన్‌కాల్ విమానాశ్రయ అధికారులకు వచ్చింది. గన్నవరం నుంచి బయలుదేరే ఎయిరిండియా విమానాన్ని హైజాక్ చేసి పాకిస్తాన్ మళ్లిస్తామంటూ చెప్పడంతో అధికారులు హుటాహుటిన అప్రమత్తమై భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే ఆ ఫోన్ కాల్ ఎక్క‌డి నుంచి వ‌చ్చింది...ఎవ‌రు చేశార‌నేదానిపై భ‌ద్ర‌తా అధికారులు ఆరా తీస్తున్నారు.