Tuesday, October 15, 2019
Follow Us on :

పాకిస్థాన్ నిర్ణయంపై అజిత్ దోవల్ ఏమన్నారో తెలుసా..?

By BhaaratToday | Published On Aug 8th, 2019

ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో భారత్ తో వాణిజ్య సంబంధాలను పాకిస్థాన్ రద్దు చేసుకుంది. అయితే ఇలా చేయడం వలన భారత్ కు ఎలాంటి నష్టం ఉండదు.. పాకిస్థాన్ కే నష్టం. దీనిపై భారత జాతీయ రక్షణ సలహాదారు అజిత్ దోవల్ స్పందించారు.

భారత్ తో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను పాకిస్థాన్ రద్దు చేసుకుంది. భారత ఆర్థిక వ్యవస్థకు పాక్ నిర్ణయంతో తీరని నష్టం వాటిల్లుతుంది. అది ఎంతగానంటే... విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ లో ఓ ప్రమోషనల్ పోస్ట్ పెడితే ఎంత ఆదాయం వస్తుందో అంత నష్టం భారత్ కు కలుగుతుంది. ఇది చాలా ఆందోళన కలిగించే అంశం. ఈ నష్టాన్ని ఎలా భర్తీ చేసుకోవాలో' అంటూ అజిత్ దోవల్ వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు. 

పాకిస్థాన్ భారత్ తో దౌత్య, వాణిజ్య సంబంధాలను కనిష్ట స్థాయికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫైర్ అయ్యారు. పాకిస్థాన్ లాంటి పొరుగు దేశం ఎవరికీ ఉండరాదని అన్నారు. నీ స్నేహితుడుని నీవు మార్చగలవు. కానీ, పొరుగువారిని మార్చే శక్తి నీ చేతిలో ఉండదు. ఇదే అసలు సమస్య. ఇలాంటి పొరుగు దేశం ఏ దేశానికీ ఉండకూడదని దేవుడిని ప్రార్థిస్తున్నానని రాజ్ నాథ్ సింగ్ అన్నారు.