Tuesday, October 15, 2019
Follow Us on :

పాక్ నుండి వచ్చిన సీక్రెట్ కోడ్ గుట్టు విప్పిన అజిత్ దోవల్

By BhaaratToday | Published On Sep 7th, 2019

జమ్మూకాశ్మీర్ లో శాంతిని నెలకొల్పటానికి భారత ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నిస్తోంది. కానీ పాక్ మాత్రం కాశ్మీర్ లో శాంతి అన్నది లేకుండా చేయాలని.. భారత్ లో ఉగ్రదాడులు జరిపి శాంతిని హరించాలని ప్రయత్నిస్తోంది. అక్కడితో ఆగకుండా భారత్ లోకి తీవ్రవాదులను పంపించాలని ఎంతగానో ప్రయత్నిస్తోంది. అందుకు కోడ్ భాషను వాడుతున్నారు. ఆ కోడ్ భాషను డీకోడ్ చేస్తున్నారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అండ్ టీమ్..! ఈ కోడ్ ను ఆయుధాల కోసమే ఉగ్రవాదులు వాడుతున్నట్టుగా భావిస్తున్నామని దోవల్ చెప్పుకొచ్చారు.  


పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఉపయోగించిన సంకేతాలను గుర్తించామని అజిత్ దోవల్ తెలిపారు. ఆపిల్ ట్రక్కులు ఆటంకాలు లేకుండా ఎలా ముందుకెళుతున్నాయి? వాటిని మీరు అడ్డుకోలేరా? లేకపోతే గాజులు పంపమంటారా? అంటూ పాకిస్థాన్ నుంచి కశ్మీర్ కు, కశ్మీర్ నుంచి పాకిస్థాన్ కు రహస్య సంకేతాలతో కూడిన సంభాషణలు నడుస్తున్నాయని అన్నారు. అలాగే ఈ కోడ్ లను తాము డీకోడ్ చేశామని కూడా చెప్పినట్లు తెలుస్తోంది. సరిహద్దు పొడువునా 20 కిమీ పరిధిలో పాకిస్థాన్ కు చెందిన సిగ్నల్ టవర్లు ఉన్నాయని, వాటిద్వారా కశ్మీర్ లోని తమ వారికి సందేశాలు పంపుతున్నట్లు తెలుస్తోంది. 

ఇక ఇటీవలే ఎల్వోసి వద్ద భారత్ లోకి చొరబడుతున్న ఇద్దరు ఉగ్రవాదులను భారత్ సైన్యం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. పాకిస్తాన్ లోని రావల్పిండికి చెందిన  నజ్నీన్ కోఖర్ - ఖలీల్ అహ్మద్ లు పాకిస్తాన్ లోని కచెర్బన్ వద్ద వారం పాటు శిక్షణ పొందినట్టు విచారణలో ఒప్పేసుకున్నారు. వారు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ కోసం పనిచేస్తారని.. పాకిస్తాన్ ప్రభుత్వ అధికారులే ఈ సంస్థను తమను కశ్మీర్ లోయలో అల్లకల్లోలం సృష్టించడానికి పంపించారని చెప్పేసారు. నాలుగు సంవత్సరాలుగా భారత సరిహద్దులు దాటడానికి ప్రయత్నిస్తున్నామని భారత ఆర్మీకి చెప్పుకొచ్చారు. ఇద్దరు ఉగ్రవాదులు భారత్ కు పట్టుబడడంతో పాకిస్తాన్ కుట్ర బట్టబయలైంది.