Wednesday, October 16, 2019
Follow Us on :

బన్నీ ఫ్యాన్స్ ను తెగ కన్ఫ్యూజ్ చేస్తున్నారుగా..!

By BhaaratToday | Published On Sep 24th, 2019

స్టైలీష్ స్టార్  అల్లుఅర్జున్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా అల..వైకుంఠపురములో.ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి..అయితే ఈ సినిపై ఒక విషయంలో మాత్రం క్లారీటీ లేదు...బన్నీ ఫ్యాన్స్ ను కన్ఫ్యూజ్ చేస్తున్న ఆ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటి అనుకుంటున్నారా...

 వచ్చే యేడాది సంక్రాంతి బరిలో భారీ చిత్రాలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. వాటిలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలిసి చేస్తున్న ‘అల వైకుంఠపురములో’ కూడా ఉంది. ఈ సినిమాను జనవరి 12న ప్రేక్షకులకి అందివ్వాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. ప్రస్తుతం ఈ విషయమే సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.  ఈ విషయమై చిత్ర నిర్మాణ సంస్థల నుండి ఇంకా ఆఫీషియల్ కన్ఫర్మేషన్ అందాల్సి ఉంది.

అల.. వైకుంఠపురములో సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు... ఈ సినిమా పాటలను నవంబర్లో విడుదల చేయలని చిత్ర యూనిట్ భావిస్తున్నారు..అయితే సినిమా షూటింగ్ ఇంకా పెండింగ్ ఉంటటంతో సినిమాను అనుకున్న టైమ్ కు ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తారా అని డౌట్ వ్యక్తం అవుతోంది..ఒకవేళ సంక్రాంతి బరిలో నుండి వెనక్కు తప్పుకుంటే అల్లుఅర్జున్ కు  సినిమా గ్యాప్ పెరిగిపోతుంది..

Image result for ala vaikuntapuramlo

 ఈ సినిమాలో బన్నీకి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. గతంలో బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి’ చిత్రాలు మంచి హిట్లుగా నిలవడంతో ఈ సినిమాపై భారీ హైప్ నెలకొని ఉంది.గత చిత్రాల ప్రొడ్యూసర్ లనే కంటిన్యూ చేస్తున్నారు త్రివిక్రమ్..ఇక హారికా అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా అల..వైకుంఠపురములో నిర్మిస్తున్నారు... ఈ చిత్రంలో టబు, సుశాంత్, జయరామ్, నివేత పేతురాజ్ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఎప్పుడు సినిమాలో ప్రతి ఫ్రేమ్ పాత్రలతో నింపేసే త్రివిక్రమ్ ఈ సారి కుడా భారీ కాస్ట్ నే ఎంచుకున్నాడు... మరోవైపు సినిమాలో మురళీశర్మ పాత్రకు కుడా  మంచి ఇంపాక్ట్ ఉంటుందని అంటున్నారు..అయితే రిలీజ్ డేట్ మాత్రం అభిమానుల్ని కలవర పెట్టేస్తోందనే చర్చలు జరుగుతున్నాయి...

Image result for ala vaikuntapuramlo