Tuesday, June 18, 2019
Follow Us on :

ఏఎన్-32 విమానం కూలిపోయిన ఘటన: ఏ ఒక్కరూ బతకలేదు

By BhaaratToday | Published On Jun 13th, 2019

జూన్ 3న అస్సోం నుంచి టేకాఫ్ తీసుకున్న ఏఎన్ -32 గాల్లోకి ఎగిరిన కొద్ది సేపటికే ఏటీసీతో సంబంధాలు తెగిపోయి అదృశ్యమైంది. ఆ తర్వాత ఎట్టకేలకు విమాన శకలాలను అధికారులు కనుగొన్నారు. బుధవారం రోజున 10 మంది ఆర్మీ సిబ్బందిని శకలాలు గుర్తించిన ప్రాంతంలో దింపింది. ముందుగా ఏఎల్‌హెచ్ మరియు ఎమ్ఐ-17 చాపర్లలో సిబ్బంది శకలాలు ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. ఆ తర్వాత సిబ్బంది చిన్నగా ఆ కొండలోయలోకి దిగారు. మొత్తం గాలించారు కూడానూ..!  

ఈ ఘటనలో ఏ ఒక్కరూ బతకలేదని భారతీయ వాయుసేన ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేయడానికి చింతిస్తున్నామని తెలిపింది. ఈరోజు తమ సెర్చ్ టీమ్ ప్రమాద స్థలికి చేరుకుందని... ప్రాణాలతో బయటపడిన ప్రయాణికులెవరినీ తమ సెర్చ్ టీములు గుర్తించలేదని ఎయిర్ ఫోర్స్ తెలిపింది. ఇదే విషయాన్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబీకులందరికీ తెలియజేశామని చెప్పారు. 

అస్సోంలోని జోర్హత్ నేవల్ బేస్‌ నుంచి జూన్ 3న మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో టేకాఫ్ తీసుకున్న ఏఎన్-32 విమానం గ్రౌండ్ సిబ్బందితో ఒంటిగంట సమయంలో సంబంధాలు తెగిపోయాయి. షియోమీ జిల్లాలోని మెచుకా అడ్వాన్స్‌డ్ ల్యాండింగ్ గ్రౌండ్ స్టేషన్‌లో మధ్యాహ్నం 1:30 గంటలకు ల్యాండ్ అవ్వాల్సి ఉంది. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 13 మంది ఉన్నారు.