Wednesday, October 16, 2019
Follow Us on :

వస్తున్నా.. అంబటి రాయుడు లేఖ

By BhaaratToday | Published On Aug 30th, 2019

ప్రపంచకప్ కు తనను ఎంపిక చేయకపోవడంతో తెలుగుతేజం అంబటి రాయుడు తీవ్ర అసంతృప్తికి గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు. దీనిపై అందరూ షాక్ కు గురయ్యారు. ఆవేశపడి నిర్ణయం తీసుకోవద్దు.. ఎంతో భవిష్యత్తు ఉందని పలువురు మాజీ క్రికెటర్లు కూడా సూచించారు. ముఖ్యంగా ఆవేశంగా తీసుకున్న నిర్ణయం అని అందరూ భావించారు. దీనిపై అంబటి రాయుడు కూడా ఆలోచించినట్లు తెలుస్తోంది. 

అంబటి రాయుడు మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. గతంలో ప్రకటించిన తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు. ఈ మేరకు హైదరాబాద్ క్రికెట్ సంఘానికి రాసిన లేఖలో స్పష్టం చేశాడు. అన్ని ఫార్మాట్లలో ఆడతానని రాయుడు తన లేఖలో పేర్కొన్నాడు. తనలో ఇంకా ఎంతో క్రికెట్ మిగిలుందన్న విషయాన్ని తన శ్రేయోభిలాషులు గుర్తు చేశారని, రిటైర్మెంట్ నిర్ణయం తీవ్ర భావోద్వేగాల నడుము తీసుకున్నదని రాయుడు తెలిపాడు.  ప్రపంచకప్ లో చోటు సాధించాలని నాలుగైదు ఏళ్లు శ్రమించానని... అయినా, చోటు దక్కకపోవడంతో మనస్థాపానికి గురయ్యానని చెప్పాడు. తన రిటైర్మెంట్ ను ఉపసంహరించుకోవాలని భావిస్తున్నట్టు గతంలో తెలిపాడు.  రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్న తర్వాత... మళ్లీ ఆలోచించానని తెలిపాడు. భారత్ కు ప్రాతినిధ్యం వహించాలని తపిస్తున్నానని రాయుడు చెప్పుకొచ్చాడు.