Saturday, December 14, 2019
Follow Us on :

అంబటి రాయుడు మనం ఆశించిన నిర్ణయం తీసుకునేలా ఉన్నాడు

By BhaaratToday | Published On Aug 24th, 2019

ప్రపంచకప్ కు తనను ఎంపిక చేయకపోవడంతో తెలుగుతేజం అంబటి రాయుడు తీవ్ర అసంతృప్తికి గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు. దీనిపై అందరూ షాక్ కు గురయ్యారు. ఆవేశపడి నిర్ణయం తీసుకోవద్దు.. ఎంతో భవిష్యత్తు ఉందని పలువురు మాజీ క్రికెటర్లు కూడా సూచించారు. ముఖ్యంగా ఆవేశంగా తీసుకున్న నిర్ణయం అని అందరూ భావించారు. దీనిపై అంబటి రాయుడు కూడా ఆలోచించినట్లు తెలుస్తోంది. 

 ప్రపంచకప్ లో చోటు సాధించాలని నాలుగైదు ఏళ్లు శ్రమించానని... అయినా, చోటు దక్కకపోవడంతో మనస్థాపానికి గురయ్యానని చెప్పాడు. తన రిటైర్మెంట్ ను ఉపసంహరించుకోవాలని భావిస్తున్నట్టు తాజాగా తెలిపాడు. ఆవేశంతో తాను రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోలేదని... జట్టులో చోటు దక్కనప్పుడు నిరాశకు గురి కావడం సహజమేనని చెప్పాడు. రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్న తర్వాత... మళ్లీ ఆలోచించానని తెలిపాడు. భారత్ కు ప్రాతినిధ్యం వహించాలని తపిస్తున్నానని చెప్పాడు. భారత్ తరపున పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడతానని తేల్చి చెప్పాడు. ఐపీఎల్ లో కొనసాగుతానని తెలిపాడు.