Saturday, October 19, 2019
Follow Us on :

రోజుకు 17.. మొత్తం 8,158..! అబద్ధాల కోరు..!!

By BhaaratToday | Published On Feb 6th, 2019

అబద్ధం చెబితే బాగా అతికినట్టు, ఓ గోడ కట్టినట్టు ఉండాలంటారు. ట్రంప్‌కి ఈ సామెత పెద్దగా తెలిసినట్టు లేదు. అందుకే తరచూ అబద్ధాలు చెబుతూ, దొరికిపోతుంటారు. చిత్రంగా తను చెప్పే ఆ అసత్యాలు త్వరగా బయటపడిపోతూ ఉంటాయి. చాలామందికి తెలియదు కానీ, ట్రంప్‌ తన మొత్తం పాలనలో 8,158 సార్లు అబద్ధాలు చెప్పారట. ఈ విషయాన్ని అక్కడి పత్రికలే చెబుతున్నాయి.  తాజాగా స్టేట్‌ ఆఫ్‌ ది యూనియన్‌ ప్రసంగంలోనూ ఆయన కొన్ని అబద్ధాలు అలవోకగా చెప్పేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తన పదవీకాలంలో 8,158 అబద్ధాలు చెప్పారని కొద్ది రోజుల క్రితం అమెరికా పత్రికలు గగ్గోలు పెట్టాయి. తాజాగా ట్రంప్‌  స్టేట్‌ ఆఫ్‌ ది యూనియన్‌  ప్రసంగం విన్న వారికి మళ్లీ అసత్యాలు ఉన్నాయని తెలుస్తుంది. కానీ కావాలని చెబుతున్నారో, సరైన సమాచారం లేక తప్పులు చెబుతున్నారో అర్థం కాదు. ఒక్కటి మాత్రం నిజం.. ఆయన వాస్తవానికి దూరంగా ఉండే విషయాలను చెబుతుంటారు. నేటి ప్రసంగాన్నీ అక్కడి కొన్ని పత్రికలు విశ్లేషించాయి. వాటిల్లో తప్పులను, తప్పుదోవ పట్టించే అంశాలను వెతికి పట్టాయి. ఏడాదికోసారి కాంగ్రెస్‌ను ఉద్దేశించి చేసే స్టేట్‌ ఆఫ్‌ ది యూనియన్‌ ప్రసంగాన్ని కూడా తప్పులకు వేదిక చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.