Thursday, November 14, 2019
Follow Us on :

పాకిస్థాన్ కు తేరుకోలేని షాక్ ఇచ్చిన అమెరికా

By BhaaratToday | Published On Aug 17th, 2019

ఆర్టికల్ 370ని భారత్ రద్దు చేయడంతో పాకిస్థాన్ పరిస్థితి ఇప్పుడే దిక్కుతోచని స్థితిలో పడింది. అమెరికా కూడా ఈ విషయంలో తాము ఏమీ చేయలేమని చెప్పేసి క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు పాకిస్థాన్ కు మరో తేరుకోలేని షాక్ ఇచ్చింది అమెరికా. పాకిస్థాన్ కు ఎన్నో ఏళ్లుగా ఆర్థిక సాయం చేస్తూ వస్తోంది అమెరికా.. అయినా పాకిస్థాన్ మాత్రం ఆ నిధులను దుర్వినియోగం చేస్తూ వస్తోంది. దీనిపై సీరియస్ అయిన ట్రంప్ ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులను భారీగా తగ్గించేసింది.     

పాకిస్థాన్‌తో 2010 లో అమెరికా ఓ ఒప్పందం చేసుకుంది. అదేమిటంటే ఐదేళ్లలో పాకిస్థాన్‌కు అమెరికా 7.5 బిలియన్ డాలర్లు సాయం చెయాలని.. అయితే ఈ ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన ఆర్థిక సాయంలో మరింత కోత విధించింది. అమెరికాలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పర్యటించిన మూడు వారాల తర్వాత ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

 ఐదేళ్లలో పాకిస్థాన్‌కు అమెరికా 7.5 బిలియన్ డాలర్లు సాయం చెయాల్సి ఉంది. కెర్రీ లూగార్ బెర్మాన్ (కేఎల్బీ) చట్టానికి 2010 సెప్టెంబరులో అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. కానీ, పాకిస్థాన్ తన భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, వారికి ఆర్థికంగా వనరులు సమకూర్చుతున్నట్టు ఆధారాలు లభించడంతో ఆ సాయాన్ని అగ్రరాజ్యం సగానికి సగం తగ్గించింది. ఇప్పటికే సెప్టెంబరులో సైనిక సహాయం కోసం అందజేయాల్సిన 300 మిలియన్ డాలర్ల సాయాన్ని అమెరికా నిలిపివేసింది. దీంతో పాకిస్థాన్‌కు అమెరికా చేసే సాయం 4.5 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఇప్పుడు మరో 400 మిలియన్ డాలర్లు కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అగ్రరాజ్యం నిర్ణయంతో పాక్‌కు అమెరికా చేసే ఆర్థిక సాయం 4.1 బిలియన్ డాలర్లకు తగ్గింది. హక్కానీ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలను అడ్డుకోవడంలో పాక్ విఫలమైందని భావించిన అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ గతేడాది జనవరిలోనే బిలియన్ డాలర్లు సాయం నిలిపివేసింది.