Tuesday, May 21, 2019
Follow Us on :

అమెరికా సైనికుల‌కు హైద‌రాబాద్‌లో శిక్ష‌ణ‌

By BhaaratToday | Published On Mar 14th, 2019

అమెరికాకు చెందిన స్పెషల్ ఆపరేషన్ ఫోర్స్ బృందం హైదరాబాద్‌లో ప్రత్యేక శిక్షణ పొందుతోంది. అమెరికా తన సైనికులకు శిక్షణ ఇచ్చేందుకు జపాన్‌లోని ఓకినావా తర్వాత భారత్‌లోని హైదరాబాద్‌ను ఎంచుకుంది. ఇబ్రహీంపట్నంలోని ఎన్‌ఎస్‌జీ సెంటర్‌లో మన దేశానికి చెందిన నేషనల్ సెక్యురిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ)తో కలిసి అమెరికా సైనికులు శిక్ష‌ణ పొందుతున్నారు. ఈ నెల12న ప్రారంభమైన ఈ ప్రత్యేకశిక్షణ ఏప్రిల్ 5వ తేదీ వరకు కొనసాగనుంది. భవిష్యత్తులో విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు ఇరు దేశాల బలగాలు కలిసి ఎదుర్కొవడంపై శిక్షణ ఇస్తున్నట్టు యూఎస్ స్పెషల్ ఆపరేషన్స్ కమాండో హెచ్‌ఎం స్మిత్ తెలిపారు. 

కమాండో ఆపరేషన్స్, పరస్పర సహకారం, మెళకువలపై శిక్షణ ఇస్తున్నామన్నారు. పసిఫిక్ రీజియన్‌లో ఉగ్రదాడులు ఎదుర్కొవడంతో పాటు శాంతిస్థాపన కోసం భారత్‌తో కలిసి పనిచేయడంలో భాగంగా అమెరికా ఈ శిక్షణ చేపట్టింది. అమెరికా సైతం భారత్‌ను ముఖ్యమైన రక్షణరంగ భాగస్వామిగా భావిస్తున్నది. ఈ శిక్షణతో హైదరాబాద్.. డిఫెన్స్ టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధిలో అమెరికా-భారత్ డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మారే అవకాశం ఉంద‌ని మిలిటరీ వర్గాలు పేర్కొంటున్నాయి.