Wednesday, October 16, 2019
Follow Us on :

అమిత్ షాను ఆకాశానికి ఎత్తేసిన ముఖేశ్ అంబానీ

By BhaaratToday | Published On Aug 30th, 2019

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఆకాశానికి ఎత్తేశారు. గాంధీనగర్ లోని పండిట్ దీన్ దయాళ్ పెట్రోలియం యూనివర్శిటీలో జరిగిన కాన్వొకేషన్ సెరమనీలో ఇద్దరూ ఒకే వేదికపై ఆశీనులైనారు. అమిత్ షా లాంటి గొప్ప నాయకుడు లభించినందుకు గుజరాత్ తో పాటు యావత్ దేశం ఎంతో గర్వపడుతోందని ముఖేష్ అంబానీ ప్రశంసించారు. అమిత్ షా నిజమైన కర్మయోగి అని, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఆకాశానికి ఎత్తేశారు ముఖేష్ అంబానీ. మీ లక్ష్యాలను ఎప్పుడూ తగ్గించుకోవద్దని, పెద్ద కలలను కనడానికి ఆలోచించవద్దని.. రానున్న రోజుల్లో భారత్ లో ఎన్నో అవకాశాలు వస్తాయని.. మీ అందరి కలలు సాకారమవుతాయని విద్యార్థులతో ముఖేష్ అంబానీ చెప్పి స్పూర్థిని రేపారు.