Saturday, October 19, 2019
Follow Us on :

పటేల్ ప్రధాని అయ్యుంటే కాశ్మీర్ సమస్యే వచ్చేది కాదు

By BhaaratToday | Published On Feb 21st, 2019

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాజమండ్రిలో పర్యటించారు. బీజేపీ రక‍్తంలోనే దేశభక్తి ఉందని అన్నారు. ఈ అయిదేళ్లలో దేశభద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని, అమరజవాన్లకు ఈ వేదిక నుంచి నివాళులు అర్పిస్తానని ఆయన తెలిపారు. భారత సైనికులకు బీజీపీ సర్కార్‌ అన్నివిధాలా అండగా ఉంటందని స్పష్టం చేశారు. యావత్ భారతం అమర జవాన్లకు నివాళి అర్పిస్తుంటే కాంగ్రెస్ మాత్రం రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.

ఆనాడు నెహ్రూ కాకుండా సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధానమంత్రి అయ్యుంటే కాశ్మీర్ సమస్యే తలెత్తేది కాదని అన్నారు. కాశ్మీర్ ను సాకుగా చూపి పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందన్నారు. ఈ సమస్యకు కారణం ఎవరు అని చెప్పాల్సి వస్తే అది నెహ్రూ తప్ప మరొకరు కాదని అన్నారు అమిత్ షా. సర్దార్ వల్లభాయ్ పటేల్ గనుక దేశానికి మొదటి ప్రధాని అయ్యుంటే మాత్రం ఇప్పుడీ దుస్థితి వచ్చేది కాదని స్పష్టం చేశారు. 


భారత దేశ ప్రధానిపై విశ్వాసం లేదంటున్న చంద్రబాబు నాయుడు పాకిస్థాన్‌ ప్రధానిపై విశ్వాసం ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పుల్వామా ఉగ్రదాడిపై కొందరు బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని అమిత్‌ షా మండిపడ్డారు. నాడు మోడీ ఇమేజ్‌తోనే చంద్రబాబు అధికారంలోకి వచ్చారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. 

అమిత్‌ షా పర్యటనకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు రాజమండ్రిలో ఈరోజు ఉదయం నిరసన తెలిపారు. అమిత్‌ షా గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు.