Tuesday, October 15, 2019
Follow Us on :

కశ్మీర్‌పై అమిత్ షా కీలక భేటీ.. రేపు కేబినెట్‌ భేటీ కూడా..

By BhaaratToday | Published On Aug 4th, 2019

జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో జతీయ భద్రతా వ్యవహారాల కమిటీతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా భేటీ అయ్యారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, కార్యదర్శి రాజీవ్‌గౌబాతో ఆదివారం అమిత్‌ షా సమావేశం అయ్యారు. వీరి భేటీలో కశ్మీర్‌పై అంశంపై కీలక చర్చ జరిగినట్లు సమాచారం. 

పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులు అమర్‌నాథ్‌ యాత్ర లక్ష్యంగా దాడి చేసేందుకు ఆ దేశ ఆర్మీ సహాయంతో కుట్రలు పన్నుతున్నారని నిఘా వర్గాలు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భద్రతా వ్యవహారాల కమిటీతో భేటీ అయిన షా.. రేపు కేంద్ర కేబినెట్‌ సమావేశాన్ని ఏర్పాటు చేయనునట్లు సమాచారం. 

కాగా.. ఇప్పటికే లక్షకు పైగా సిబ్బందిని కశ్మీర్‌కు తరలించిన కేంద్రం.. ప్రస్తుత పరిస్థితిపై ఎలాంటి ఆందోళన అవసరంలేదని, వదంతులను నమ్మవద్దని ప్రజలకు, రాజకీయ నాయకులకు  సూచించారు. ఈ నేపథ్యంలో రేపు జరగబోయే మంత్రి మండలి సమావేశంలో తీసుకునే నిర్ణయంపై  ఉత్కంఠ నెలకొంది.