Wednesday, October 16, 2019
Follow Us on :

రాష్ట్రంలో 144 సెక్షన్…మాజీ ముఖ్యమంత్రుల గృహ నిర్బంధం

By BhaaratToday | Published On Aug 5th, 2019

జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు మరింత వేడెక్కాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం అర్ధరాత్రి(తెల్లవారితే సోమవారం) నుంచి 144 సెక్షన్‌ అమల్లోకి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లాలను పోలీసులు గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. వారిని గడప దాటనివ్వబోమని అధికారులు స్పష్టం చేశారు. శాంతంగా ఉండాలని ప్రజలకు ఓ ట్వీట్‌ ద్వారా ఒమర్‌ విజ్ఞప్తి చేశారు. ‘రేపు ఏం జరగబోతోందో దేవుడికే తెలియాలి. ఈ రాత్రి సుదీర్ఘంగా ఉండబోతోంది’ అని మెహబూబా ట్వీట్‌ చేశారు. తమను పోలీసులు అరెస్టు చేశారని కాంగ్రెస్‌ నేత ఉస్మాన్‌ మాజిద్‌, సీపీఎం ఎమ్మెల్యే ఎం.వై.తరిగామి పేర్కొన్నారు. వారి అరెస్టును పోలీసులు ధ్రువీకరించలేదు. మరోవైపు, జమ్మూకశ్మీర్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, కశ్మీర్‌ ఐజీలతో గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ ఆదివారం అర్ధరాత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలను సోమవారం మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.