Tuesday, June 18, 2019
Follow Us on :

మాట నిల‌బెట్టుకున్న బిగ్ బి.. రైతుల అప్పులు తీర్చి..

By BhaaratToday | Published On Jun 12th, 2019

ఇండియ‌న్ సినిమా బిగ్ బి అమితాబ్ బచ్చన్ త‌న మాట నిల‌బెట్టుకున్నారు. రైతుల‌కు ప్రామిస్ చేసినట్లుగానే వారి అప్పుల‌ను తీర్చాన‌ని  అమితాబ్ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. బీహార్ రాష్ట్రానికి చెందిన 2100 మంది రైతుల అప్పులు తీరుస్తానని గతంలో ఆయన మాట ఇచ్చారు. అనుకున్నట్లుగానే ఎంపిక చేసిన రైతుల అప్పులు అమితాబ్ తీర్చేశారు. 

తాను ముందుగా ప్రామిస్ చేసినట్లుగానే బీహార్ రాష్ట్రానికి చెందిన 2, 100 రైతులను ఎంపిక చేసి వారి అప్పులు తీర్చేసినట్లు అమితాబ్ బ్లాగ్‌లో వెల్లడించారు. కొందరి అప్పులను నేరుగా బ్యాంకులో వేయడం జరిగిందన్నారు. మరికొందరిని తన ఇంటికి పిలిపించి..అభిషేక్, శ్వేత చేతుల మీదుగా చెక్కులు అందించడం జరిగిందన్నారు.

బాలీవుడ్‌లో బిగ్ బిగా పిలుచుకొనే అమితాబ్ బచ్చన్...సినిమాలు, వివిధ యాడ్స్ ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తుంటారు. ఆదాయంలో కొంత సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తుంటారు. గతంలో కూడా ఎందరో రైతులను ఆదుకున్నారు. యూపీకి చెందిన 1000 మంది రైతులకు రూ. 5.5 కోట్ల రూపాయలు చెల్లించారు బిగ్ బి.