Tuesday, May 21, 2019
Follow Us on :

బీజేపీకి 300 సీట్ల‌కు పైగా వ‌స్తాయ్.. ఆరో విడత పోలింగ్ పూర్తయ్యేనాటికే..

By BhaaratToday | Published On May 15th, 2019

ఈ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీకి 300 సీట్లకు పైగా వస్తాయని.. ఆరో విడత పోలింగ్ పూర్తయ్యేనాటికి బీజేపీ మ్యాజిక్ ఫిగర్ 272 దాటేసిందని బీజేపీ  జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. చివరి విడత పోలింగ్ తో తమ పార్టీ 300 సీట్ల మార్కును దాటుతుంద‌ని అమిత్ షా అన్నారు. నేడు ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.

ఎన్ని సీట్లు వస్తాయని మీరు పదేపదే అడుగుతున్నారు. నేను దేశవ్యాప్తంగా పర్యటించి ప్రజల నాడి ఎలా ఉందో చూశానని.. ఐదు, ఆరు విడతల పోలింగ్ నాటికే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ దాటేసిందని ఆయ‌న అన్నారు. ఇప్పుడు ఏడో దశ పోలింగ్ తర్వాత బీజేపీ మెజారిటీ 300సీట్లు దాటుతుందని.. తద్వారా మరోసారి నరేంద్ర మోదీ నాయకత్వంలో మ‌రోమారు ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటవుతుందని అమిత్ షా స్పష్టం చేశారు.