Wednesday, October 16, 2019
Follow Us on :

ఆనంద్ మహీంద్రా.. ఇమ్రాన్ ఖాన్ పై మాంచి జోకేశారుగా..?

By BhaaratToday | Published On Aug 26th, 2019

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటారు. నెటిజన్ల కామెంట్స్ కు రిప్లైలు ఇస్తూ తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటాడు. పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ పై ఆనంద్ మహీంద్రా వేసిన జోక్ నెటిజన్లను విపరీతంగా అలరిస్తోంది. 

ఇరాన్‌ పర్యటనకు వెళ్లిన ఇమ్రాన్‌ఖాన్‌ అక్కడ మాట్లాడుతూ  ‘సరిహద్దు పంచుకుంటున్న జర్మనీ, జపాన్‌లు రెండో ప్రపంచ యుద్ధం అనంతరం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందాయి’ అంటూ ట్వీట్ చేశారు. 

ఈ వీడియోను చూసిన ఆనంద్‌ మహీంద్రా   ‘దేవుడా...ఆయనను (ఇమ్రాన్‌) మాకు హిస్టరీ లెక్చరర్‌ చేయనందుకు నీకు ధన్యవాదాలు’ అంటూ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి నవ్వులు పూయిస్తున్నారు. ఎందుకు ఈ మాట ఆనంద్ మహీంద్రా అన్నారంటే జర్మనీ, జపాన్‌ దేశాల మధ్య చాలా దూరం ఉంది. జపాన్ ఆసియాలో వుంటే, జర్మనీ యూరప్ లో వుంది. రెండు దేశాలు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అందుకే 'ఆయనను మాకు హిస్టరీ లెక్చరర్‌ చేయకుండా కాపాడావు దేవుడా' అంటూ ఆనంద్‌ ఎగతాళి చేస్తూ ట్వీట్‌ చేశారు. ఈ పోస్టుకు భారతీయుల నుండి విపరీతమైన స్పందన వస్తోంది. 

Image result for anand mahindra and imran khan