Sunday, December 15, 2019
Follow Us on :

గుండెలపై తన్నాడు.. కర్ర తీసుకొని చావబాదాడు.. అనంతపురం జిల్లాలో దారుణ ఘటన

By BhaaratToday | Published On Aug 17th, 2019

అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమించుకుని.. పెళ్లి చేసుకోవాలనుకున్న ఇద్దరు మైనర్లు ఊరు నుంచి పారిపోయారు. వారిని ఊరికి తీసుకువచ్చి  పంచాయతీ పెట్టగా ఆ పంచాయతీకి వచ్చిన పెద్ద ఆ యువతిని ఇష్టమొచ్చినట్లు కొట్టాడు.  గుండెలపై తన్నాడు కూడా చుట్టూ ఎంతో మంది ఉన్నా కనీసం నోరు తెరవలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  
 
గుమ్మఘట్ట మండలంలోని కేపీదొడ్డి గ్రామానికి చెందిన ప్రేమజంట పది రోజుల క్రితం ఊరి విడిచి వెళ్లిపోయింది. వారిని పట్టుకొచ్చి  గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. పంచాయితీకి వచ్చిన గ్రామ పెద్ద, మాజీ ఎంపీటీసీ లింగప్ప మాత్రం కర్రతో రెచ్చిపోయాడు. అందరూ చూస్తుండగానే బాలికను కర్రతో గొడ్డును బాదినట్టు బాదాడు. కాళ్లతో బాలిక గుండెలపై కూడా తన్నాడు. యువకుడిపైనా, బాలిక తండ్రిపైనా తన ప్రతాపం చూపించాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది.