Wednesday, October 16, 2019
Follow Us on :

ఎన్నో దారుణాలు.. పాక్ లో హిందూ యువతిని కిడ్నాప్ చేసి మత మార్పిడి

By BhaaratToday | Published On Sep 2nd, 2019

పాకిస్థాన్ లో హిందువులపై జరుగుతున్న దారుణాలు అన్నీ, ఇన్నీ కావు. స్వాతంత్య్రం వచ్చి విడిపోయాక పాకిస్థాన్ లో హిందువుల పరిస్థితి దారుణంగా తయారైంది. హిందువుల సంఖ్య కూడా భారీగా తగ్గిపోయింది. మైనారిటీలపై ఎన్నో ఏళ్లుగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. మైనారిటీలను బలవంతంగా మతం మార్చడం కూడా సర్వసాధారణమే..! ఇటీవల పాక్ లో ఓ సిక్కు యువతిని అపహరించిన కొందరు యువకులు ఆమెను ఇస్లాంలోకి మార్చిన విషయం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది.  

ఇప్పుడు సింధు ప్రావిన్స్‌లోని ఓ హిందూ యువతిని అపహరించిన యువకులు ఆమెను ఇస్లాం మతంలోకి మార్చి ముస్లిం యువకుడితో వివాహం జరిపించారు.బీబీఏ చదువుతున్న తన కుమార్తె గత నెల 29న కాలేజీకి వెళ్లి తిరిగి రాలేదని యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితురాలిని ఆమె క్లాస్‌మేట్ బాబర్ అమన్ తన స్నేహితుడు మిర్జా దిల్వర్ బేగ్‌తో కలిసి అపహరించినట్టు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. మీర్జా దిల్వర్.. పాక్ ప్రధాని ఇమ్రాన్ సారథ్యంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) సభ్యుడని తేలింది. బాధితురాలిని కిడ్నాప్ చేశాక సియోల్‌కోట్‌లోని బేగ్ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను ఇస్లాంలోకి మార్చి బాబర్‌కు ఇచ్చి వివాహం చేశారు.  బాధిత యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. బాబర్, బాధిత యువతి ఆచూకీ లభించలేదు.