Thursday, July 18, 2019
Follow Us on :

భారత్ అద్భుత విజయంపై అమిత్ షా స్పందన ఇదే..!

By BhaaratToday | Published On Jun 17th, 2019

పాకిస్థాన్ పై వరల్డ్ కప్ లో భారత్ అద్భుత విజయాన్ని సాధించింది. ఏ దశలోనూ పాకిస్థాన్ భారత్ ముందు సరితూగలేదు. దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. పలువురు ప్రముఖులు కూడా భారత్ విజయంపై ఆసక్తికర ట్వీట్స్ చేశారు. భారత్ విజయంపై  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా త‌న ట్విట్ట‌ర్ అకౌంట్  ద్వారా విషెష్ చెప్పారు. పాకిస్థాన్‌పై ఇది మ‌రో దాడి అని, దాని ఫ‌లితం కూడా అలాగే ఉంద‌ని ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. పాక్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన టీమిండియా ఆట‌గాళ్ల‌కు అమిత్ షా అభినందనలు చెప్పారు. ప్ర‌తి భార‌తీయుడు ఈ విజయం ప‌ట్ల గ‌ర్వంగా ఉన్నారని.. విజ‌యాన్ని ప్ర‌తి ఒక్క‌రూ సెల‌బ్రేట్ చేసుకుంటున్నార‌న్నారు. పలువురు రాజకీయనాయకులు భారత్ విజయాన్ని తమ తమ సోషల్ మీడియా అకౌంట్లలో కొనియాడారు. 

 ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అద్భుత సెంచరీతో 336 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిన 89 పరుగుల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. రోహిత్‌ శర్మ (140) భారీ శతకం.. కోహ్లీ (77), రాహుల్‌ (57) హాఫ్‌ సెంచరీల సహాయంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 5 వికెట్లకు 336 పరుగులు చేసింది. ఆమిర్‌కు మూడు వికెట్లు దక్కాయి. అయితే చివర్లో వర్షం కారణంగా పాక్‌ లక్ష్యాన్ని 40 ఓవర్లలో 302 పరుగులుగా నిర్ణయించారు. పాక్‌ ఆరు వికెట్లకు 212 పరుగులే చేసి ఓడింది. ఫఖర్‌ జమాన్‌(62), బాబర్‌ ఆజమ్‌(48), ఇమాద్‌ వసీమ్‌(46 నాటౌట్‌) రాణించారు. కుల్దీప్‌, విజయ్‌ శంకర్‌, హార్దిక్‌ పాండ్యాలకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా రోహిత్‌ నిలిచాడు.