Thursday, October 17, 2019
Follow Us on :

వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఇంగ్లండ్‌ను విజేతగా ప్ర‌క‌టించ‌డంపై స్పందించిన స‌చిన్‌

By BhaaratToday | Published On Jul 17th, 2019

టైగా ముగిసిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఫలితాన్ని తేల్చేందుకు నిర్వహించిన సూపర్ ఓవర్ కూడా టై అయింది. దీంతో మ్యాచ్‌లో అత్యధిక బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించడంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించి ఉండే బాగుండేదన్న అభిప్రాయాలు కూడా ప్ర‌తి ఒక్క‌రిలో వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఫలితాన్ని తేల్చేందుకు బౌండరీ నిబంధనను ఎంచుకున్న ఐసీసీపై మాజీ క్రికెటర్లు, అభిమానులు మండిపడుతున్నారు. తాజాగా, ఈ వివాదంపై దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ స్పందించారు. సూపర్ ఓవర్ కూడా టైగా ముగిసినప్పుడు మరో సూపర్ ఓవర్ నిర్వహించి ఉంటే సమస్య పరిష్కారమయ్యేదని, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేదని అభిప్రాయపడ్డాడు. అయితే, ఇది ఒక్క ప్రపంచకప్‌కు మాత్రమే పరిమితం కాదని, అన్ని టోర్నమెంట్లలోనూ ఇదే పద్ధతిని అమలు చేయాలని ఐసీసీని కోరాడు.