Monday, August 19, 2019
Follow Us on :

29 ఏళ్లకే కోహ్లీని పెళ్లి చేసుకోవడంపై స్పందించిన అనుష్క

By BhaaratToday | Published On Jul 17th, 2019

అనుష్క శర్మ బాలీవుడ్ లో టాప్ హీరోయిన్  వెలుగొందుతున్న సమయంలోనే భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకుంది. ఇతర హీరోయిన్లు 30 దాటాక పెళ్లి చేసుకున్నారు కానీ అనుష్క శర్మ మాత్రం 29 ఏళ్లకే పెళ్లి చేసేసుకుంది. ఒక హీరోయిన్ టాప్ రేంజిలో ఉన్నప్పుడు అంత తక్కువ ఏజ్ లో పెళ్లి ఎందుకు చేసుకుంది అని చాలా మంది ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనుష్క శర్మ సమాధానం చెప్పింది. 

ఫిలింఫేర్ కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో 29 ఏళ్లకే కోహ్లీని పెళ్లి చేసుకోవడంపై అనుష్క శర్మ స్పందించింది. 29 సంవత్సరాలకే తాను పెళ్లి చేసుకున్నాననీ..  ఈ వయసులో హీరోయిన్స్ పెళ్లాడటం చాలా అరుదనీ.. కానీ విరాట్‌తో ప్రేమలో ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాననీ అనుష్క చెప్పింది. వివాహం అనేది సహజమైన ప్రక్రియే కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని ఫిక్స్ అయ్యానని అంది. మగాళ్లు ఎలాంటి సందేహం లేకుండా పెళ్లి చేసుకుని తమ పని కొనసాగిస్తున్నారనీ.. మహిళలు కూడా ఎందుకు అలా చేయకూడదని ప్రశ్నించింది. పెళ్లి వల్ల కెరీర్ దెబ్బతింటుందని అస్సలు ఆలోచించకూడదని అనుష్క తెలిపారు.      ఆడియన్స్ ఇండస్ట్రీకంటే ఎక్కువ డెవలప్ అయ్యారనీ.. వారు నటీనటులను కేవలం తెరపై చూడటానికి మాత్రమే ఆసక్తి చూపుతారనీ ఆమె చెప్పింది. పర్సనల్ లైఫ్ గురించి పట్టించుకోరనీ.. మీకు పెళ్లైనా, పిల్లలు ఉన్నా వారికి అనవసరని.. మనం మొదట ఈ ఆలోచన నుంచి బయటపడాలని అనుష్క చెప్పుకొచ్చారు.