Friday, July 19, 2019
Follow Us on :

ఏపీలో టెన్త్ ఫ‌లితాలు విడుద‌ల‌..ఏ జిల్లాలో ఎంత శాత‌మంటే..

By BhaaratToday | Published On May 14th, 2019

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఫలితాలు ఈ రోజు విడుద‌ల చేశారు. టెన్త్‌లో 94.88 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫ‌లితాల్లో ఏపీలోనూ బాలికలదే పైచేయి నిలిచింది. బాలికలు-95.09 శాతం, బాలురు 94.68 శాతం ఉత్తీర్ణత సాధించారు. 5,464 స్కూళ్లలో వంద శాతం..3 స్కూళ్లలో సున్నా శాతం ఉత్తీర్ణత సాధించారు. అయితే మొద‌టి స్థానంలో  తూర్పుగోదావ‌రి జిల్లా ఉండ‌గా, చివ‌రి స్థానంలో నెల్లూరు జిల్లా ఉంది.

ఏ జిల్లాలో ఎంత శాతం... 
• తూర్పు గోదావరి జిల్లా 98.19 శాతం -మొదటి స్థానం
• ప్రకాశం జిల్లా 98.17 శాతం – రెండో స్థానం    
•చిత్తూరు జిల్లా 97.41 శాతం – మూడో స్థానం
• విజయనగరం 97.28 శాతం – నాలుగో స్ధానం
• విశాఖ జిల్లా 96.37 శాతం – ఐదో స్థానం
• శ్రీకాకులం జిల్లా 95.58 శాతం – ఆరోస్థానం
• అనంతపురం జిల్లా 95.55 శాతం – ఏడో స్థానం
• గుంటూరు జిల్లా 95.35 శాతం – ఎనిమిదో స్థానం
• కృష్ణా జిల్లా 93.96 శాతం – తొమ్మిదో స్థానం
• పశ్చిమగోదావరి జిల్లా 93.29 శాతం - పదో స్థానం
• కడప జిల్లా92.90 శాతం – 11వ స్థానం
• కర్నూలు జిల్లా 92.10 శాతం – 12వ స్థానం
• నెల్లూరు జిల్లా 83.19 శాతం – 13వ స్థానం (చివరి స్థానంలో) ఉంది.