Wednesday, October 16, 2019
Follow Us on :

పదేళ్లు గడువున్నా..! ఐదేళ్లలోనే సాకారం చేశాం..!!

By BhaaratToday | Published On Mar 1st, 2019

ఏపీకి ఇచ్చిన హామీలను పదేళ్లలో నెరవేర్చాలని పునర్విభజన చట్టంలో పేర్కొన్నప్పటికీ ఐదేళ్లలోనే వాటిని పూర్తి చేశామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ప్రధాని మోడీ ఐదేళ్లలో 39 సంస్థలను రాష్ట్రానికి ఇచ్చారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో అవినీతి, దోపిడీ రాజ్యమేలుతున్నాయని కన్నా ఆరోపించారు. మోడీ అన్యాయం చేశారని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖ రైల్వే జోన్‌పై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని.. రైల్వే ఆదాయంతో రాష్ట్రాలకు సంబంధం ఉండదని సీఎం చంద్రబాబుకు తెలియదా? అని కన్నా ప్రశ్నించారు. సీనియర్‌ నేత, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 12లక్షల ఇళ్లను మంజూరు చేసిందన్నారు. విశాఖలో హెచ్‌పీసీఎల్‌ విస్తరణ జరుగుతోందని.. ఆనందపురం-అనకాపల్లి మధ్య 6 వరుసల రోడ్ల పనులు ప్రారంభమయ్యాయని ఆయన చెప్పారు. విశాఖ జిల్లాలో కేంద్రం మెడ్‌సిటీని ఏర్పాటు చేసిందని కంభంపాటి హరిబాబు గుర్తు చేశారు.